పాకిస్తాన్ తో చర్చలు జరపం.. కశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం : అమిత్ షా

దాయాది పాకిస్తాన్ తో చర్చల విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరపాలని కొందరు సూచనలు చేస్తున్నారని, కానీ.. ఆ దేశంతో భారత్ ఎందుకు చర్చలు జరపాలని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ లో మూడు రోజుల పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. పాక్ తో చర్చలు జరిపేదే లేదని స్పష్టం చేశారు. తాము బారాముల్లా ప్రజలతో మాట్లాడతామని, కశ్మీరు ప్రజలతో మాట్లాడతామన్నారు.

 

 

జమ్మూ-కశ్మీరులో 1990వ దశకం నుంచి ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని ప్రశ్నించారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని దుయ్యబట్టారు.ముఫ్తీలు, అబ్దుల్లా కుమారులు,కాంగ్రెస్ పార్టీలు ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదని, దానిని తుదముట్టిస్తుందని చెప్పారు. జమ్మూ-కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్