అమరావతి రైతుల పాదయాత్రకు 4 రోజుల బ్రేక్…

అమరావతి రైతులు తమ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. నాలుగు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరుకు నిరసనగా 4 రోజులు నిలిపేస్తున్నామని అన్నారు. వీరి విషయంలో నేరుగా కోర్టులోనే తేల్చుకోవాలని రైతులు అనుకున్నారు. అయితే ప్రస్తుతం కోర్టుకి సెలవులు వున్న నేపథ్యంలో 4 రోజులు ఆగాలని అుకున్నారు. రామచంద్రాపురంలో పోలీసులకు, రైతులకు మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

మరోవైపు అమరావతి రైతుల పాదయాత్ర 41 వ రోజుకి చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి వుంది. అయితే.. రైతులను పోలీసులు అనుమతించలేదు. సంఘీభావానికి వస్తున్న వారిని కూడా అనుమతించలేదు.

Related Posts

Latest News Updates