తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణలో మరో అడుగు పడింది. ఇప్పటికే కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు. తాజాగా తిరుమలలో భక్తుల కోసం ఉచితంగా నడుపుతున్న థర్మ రథాల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలను కాలుష్య రహిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. రెండో విడతలో భాగంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇక… ధర్మ రథాల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు 10 బస్సులు విరాళంగా ఇవ్వాలని ఒలెక్ట్రా కంపెనీని కోరామని అన్నారు. ఇందులో భాగంగా 15 కోట్లు విలువ చేసే 10 బస్సులను విరాళంగా ఇచ్చేందుకు కంపెనీ ముందుకు రావడం సంతోషమన్నారు.