మరో రెండు నగరాల్లో 5జీ సేవలు… ప్రకటించిన ఆకాశ్ అంబానీ

5జీ సేవల విషయంలో రిలయన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ సేవలను మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తామని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. నేటి నుంచి చెన్నై, నాథ ద్వారాలో కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రాజస్థాన్ లోని శ్రీనాథ్ జీ ఆలయాన్ని ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. అలాగే రాజస్థాన్ వేదికగా ఆయన 5జీ సేవలను ప్రారంభించారు.

 

ఇదిలా ఉంటే.. దేశంలో అక్టోబర్ 1 నుంచే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి రావాలంటే ఇంకా రెండు, మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన పట్ణణాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో ఉన్న జీయో కస్టమర్లకు ఇప్పటినుంచి 5జీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

Related Posts

Latest News Updates