ఏపీ సీఎస్ గా విజయానంద్ కు అదనపు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా కె.విజయానంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకుంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యల కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమీర్ శర్మ డిశ్చార్జ్ అయి మళ్లీ విధుల్లో చేరేవరకు విజయానంద్ తాత్కాలిక సీఎస్ గా విధులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విజయానంద్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విజయానంద్ విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు.

Related Posts

Latest News Updates