ఆ మూడు రోజులు శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ  రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని దేవస్థానం అధికారులు తెలిపారు. అక్టోబరు 25న  సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలపాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు. నవంబరు 8న చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts

Latest News Updates