ఎయిర్ ఫోర్స్ లో కొత్త విభాగం..వచ్చే ఏడాది నుంచే

భారత వాయుసేనలో వచ్చే సంవత్సరం నుంచి యువతులను అగ్నివీరులుగా నియమించుకొంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా చండీగఢ్లో సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన..వాయుసేనలో కొత్తగా ఆయుధ వ్యవస్థ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే డిసెంబర్లో 3 వేల మంది అగ్నివీరులను నియమించి, ప్రాథమిక శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.  ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొనే కొత్త యూనిఫాంను వాయుసేన సిబ్బందికి అందజేయనున్నది. దీన్ని ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా అధికారికంగా విడుదల చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వాయుసేనలోకి ఎయిర్ వారియర్లను ర్రికూట్ చేయడం సవాళ్లతో కూడుకున్న అంశమని, అయితే, దేశసేవ కోసం యువత సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు మనకు లభించిన అవకాశం ఇదని అన్నారు. అగ్నివీరుల శిక్షణ విధానాన్ని మార్చామని, ఐఏఎఫ్లో కెరీర్ను కొనసాగించేందుకు తగిన రీతిలో వారిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులను కూడా వైమానిక దళంలో చేర్చుకుంటామని, ఇందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

Related Posts

Latest News Updates