రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ తన పుట్టినరోజును ఎలాంటి ఆడంబరం, హంగామా లేకుండా సాదాసీదాగా జరుపుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ సందర్భంగా పుతిన్కు ట్రాక్టర్ను గిఫ్ట్గా ఇచ్చారు. ట్రాక్టర్లు ఉత్పత్తిలో బెలారస్ నెంబర్ వన్. అయితే పుతిన్ బర్త్డే సందర్భంగా సెయింట్ పీటర్స్బర్గ్కు లుకషెంకో వెళ్లారు. మాజీ సోవియేట్ నేతలు కొందరు ఆ మీటింగ్కు హాజరయ్యారు. రకరకాల ట్రాక్టర్లలో తిరగడం పుతిన్కు సాధారణంగా అలవాటే. బెలారస్ అధ్యక్షుడితో పాటు తజకిస్తాన్ అధ్యక్షుడు రెహ్మన్ కూడా ఓ గిఫ్ట్ ఇచ్చారు. రెండు రకాల పుచ్చకాయలను పుతిన్కు గిఫ్ట్గా ఇచ్చారు. ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన పుతిన్పై పశ్చిమ దేశాలు ఆగ్రహంతో ఉన్నా.. ఆయన బర్త్డే సందర్భంగా మాత్రం సోవియేట్ నేతలు ప్రశంసలు కురిపించారు.