అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 700 దుకాణాలు దగ్ధం

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ దైనిక్ బజార్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. తెల్లవారు ఝాము 4 గంటలకే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మార్కెట్ రాష్ట్రంలోనే అతి పురాతన మార్కెట్ అని, ఈటా నగర్ కు 14 కిలోమీటర్ల దూరంలో వుంటుందని పోలీసులు తెలిపారు. అయితే… దీపావళి వేడుకల సందర్భంగా పేల్చిన బాణాసంచా వల్లే మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అగ్నిమాపక శాఖ వెంటనే చర్యలు చేపట్టిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే… అగ్ని ప్రమాదం జరిగిన చాలా సేపటి తర్వాత పోలీసులు స్పందించారని, అందుకే ఇంత భారీ నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

Related Posts

Latest News Updates