ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు మహాకాళేశ్వరాలయ కారిడార్ ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు మహా కాళేశ్వరాలయ కారిడార్ ప్రారంభం కానుంది. మహాకాళ్ లోక్ పేరిట అభివ్రుద్ధి చేసిన పనులను మోదీ ఆవిష్కరించనున్నారు. కార్తిక్ మేళా గ్రౌండ్ లో ప్రత్యేక పూజలు చేసి, ఈ కారిడార్ ను మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం మొత్తం 856 కోట్లు కేటాయించారు. మొదటి దశలో 316 కోట్లు కేటాయించారు. 900 మీటర్ల కంటే పొడవైన ఈ కారిడార్ దేశంలోనే రెండో అతిపెద్ద కారిడార్ గా గుర్తింపు పొందింది. మహాకాళేశ్వర ఆలయం చుట్టూరా వుండే పాత రుద్ర సాగర్ సరస్సు చుట్టూ ఈ కారిడార్ విస్తరించి వుంటుంది.

 

ప్రాజెక్టు మొదటి దశలో మహాకాల్ దేవాలయం, రుద్ర సాగర్ సరస్సు, వంతెన నిర్మాణం, సరస్సు ఒడ్డు, మహాకాళేశ్వర్ వాటిక, ధర్మశాల, అన్నక్షేత్రం వంటి వాటిని అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా తామర చెరువు కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇలా మహాకారిడార్ వల్ల ఆలయ స్థలం దాదాపు 8 రెట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

 

 

మౌలికసదుపాయాల మౌలిక సదుపాయాల మెరుగుదలలో భాగంగా కాంప్లెక్స్‌కు ప్రవేశ దారులను విభజించారు. పార్కింగ్ స్థలాలను కూడా అప్‌గ్రేడ్ చేశారు, ఆలయానికి వచ్చే సందర్శకులకు ప్రవేశం, బయలుదేరే ప్రదేశాలకు అవాంతరాలు లేకుండా చేశారు. మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రం తిరగవేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి ప్రాత:కాలం భస్మాభిషేకం చేస్తారు.

Related Posts

Latest News Updates