ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…దీపావళి రోజున

దీపావళి  పండుగ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీపావళి రోజున పటాకులు కాల్చితే   ఆరు నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు. ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.  ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ సర్కారు గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నది. అయితే, ఈ నెల 21న ‘దియే జలావో.. పతాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. పటాకులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు   తెలిపారు.  దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధిస్తూ సెప్టెంబర్లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates