అద్భుత దృశ్య కావ్యం ‘శాకుంతలం’.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 4న విడుదల

ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీని ఆధారంగా  భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.  శాకుంత‌లం కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.  ఇటీవ‌ల ‘శాకుంతలం’ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుదలై ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న ఆస‌క్తి మ‌రో లెవ‌ల్‌కు చేరుకుంది. పురాణ ప్ర‌ణ‌య గాథ‌ను చూడాల‌ని వారెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ఎపిక్ ఫిల్మ్‌ మేక‌ర్, డైరెక్ట‌ర్‌ గుణ శేఖర్ కశ్య‌ప క‌నుమ‌లు (కాశ్మీర్‌)లో సాగే ఈ ప్రేమ క‌థ‌ను త‌న‌దైన మార్క్‌తో అద్భుతంగా ఆవిష్క‌రించారు. దుష్యంత పురు రాజ‌వంశం యొక్క వైభ‌వాన్ని గ్రాండియ‌ర్‌గా, క‌ళ్లు చెదిరేలా అసాధార‌ణంగా తెర‌కెక్కించారాయ‌న‌. హృదయానికి హ‌త్తుకునే క‌థ‌తో పాటు భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టించారు. స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది. గుణ శేఖ‌ర్ ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వంలో ఆవిష్కృత‌మ‌వుతోన్న ఈ ప్రేమ కావాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు.

Related Posts

Latest News Updates