కెనడా వెళ్లే భారతీయుల్లారా బహుపరాక్…. హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

కెనడాలో భారతీయులపై స్థానిక ముస్లింలు దాడి చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కెనడాలో మతపరమైన హింస పెట్రేగిపోతోందని, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయని, అప్రమత్తంగా వుండాలని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ హెచ్చరికలు చేసింది. కెనడాకు వెళ్లే భారతీయులు, కెనడాకు వెళ్లే విద్యార్థులందరూ అప్రమత్తంగా వుండాలని కోరింది.

 

ట్రావెలింగ్ కోసం వెళ్లే వారు. ఉన్నత చదవుల కోసం వెళ్లేవారు అత్యంత జాగరూకతతో వుండాలని సూచించింది. నిత్యం అప్రమత్తంగా వుండాలని కోరింది. కెనడలా భారతీయులపై అంత హింస, దాడులు జరుగుతున్నా… అక్కడి ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ ఆక్షేపించింది. అయితే… తాము మాత్రం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని కెనడా ప్రభుత్వానికి చేరవేశామని కేంద్రం స్పష్టం చేసింది.

 

Related Posts

Latest News Updates