హీరో ఈశ్వర్ రెండో చిత్రం ” సూర్యాపేట్ జంక్షన్”!

యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న “కొత్తగా మా ప్రయాణం” ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్, గా కథనం ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్”. ఈ చిత్రాన్ని యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ మాస్ యూత్ ఫుల్  ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్” మూవీకి రాజీవ్ సాలూరు, గౌర హరిలు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రం హైదరాబాద్ సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, జరుపుకుంటుంది.  ఈ సందర్బంగా చిత్ర హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. నేను చేసిన “కొత్తగా మా ప్రయాణం” చిత్రం సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో నేను సక్సెస్ సాధిస్తాననే నమ్మకం మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత చేస్తున్న రెండవ చిత్రం “సూర్యాపేట్ జంక్షన్”. కొవిడ్ తర్వాత నేను రాసుకున్న సబ్జెక్ట్ సూర్యాపేట్ జంక్షన్. అప్పటికే “కథనం” చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  దర్శకుడు నాదెళ్ల రాజేష్ కి “సూర్యాపేట్ జంక్షన్” స్టోరీ చెప్పడం జరిగింది. ఆయనకి కథ నచ్చడంతో ఈ స్టోరీ మీద రెండు సంవత్సరాల నుండి  తనతో కలసి డెవలప్ చేశాను.  ఆతర్వాత నిర్మాతలు అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు, విష్ణువర్ధన్ లతో స్టోరీ చెప్పడం జరిగింది. నిర్మాతలు వెంటనే ఒప్పుకోవడంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం.  హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ చేశాం. మొయినాబాద్ లో ఒక ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసి చాలా రిచ్ గా సాంగ్ ను చిత్రీకరించాం. ఈ సాంగ్ తో షూటింగ్ మొత్తం విజయవంతంగా  పూర్తి అయ్యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.  దర్శకుడు  నాదెండ్ల రాజేష్ మాట్లాడుతూ… మా హీరో ఈశ్వర్ గారు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్ గా నటించిన నైనా సర్వర్ కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్  విలన్  రోల్ ఈ సినిమాకు కీలకం. ఇంకా చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్  ఇలా చాలా మంది ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. రోషన్ సాలూరి, గౌర హరిలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు ఈ సినిమా కొరకు ఎక్కడా  కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తాము అన్నారు. సాంకేతిక నిపుణులు  బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్  టైటిల్ : సూర్యాపేట జంక్షన్  నిర్మాతలు : అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్  డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్  స్టోరీ : ఈశ్వర్  మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్ ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ కో డైరెక్టర్ : శ్రీనివాస్ లిరిక్స్ : ఎ.రహమాన్  పోస్టర్ డిజైనర్ ధనియేలె రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్  పి. ఆర్. ఓ : కడలి రాంబాబు

Related Posts

Latest News Updates