టీడీపీ హయాంలో డేటా చోరీ నిజమే… ప్రకటించిన ప్రభుత్వం… కౌంటర్ ఇచ్చిన టీడీపీ

టీడీపీ హయాంలో డేటా చోరీ జరిగిందన్న వాదన వాస్తవమేనని పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమక కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్ కమిటీ… తాను రూపొందించిన మధ్యంతర నివేదికను అసెంబ్లీలో చదివి వినిపించారు. టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 2018-19 మధ్య కాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని, తెలుగు దేశానికి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షల ఓట్లరు రద్దు చేశారని, దీనిని తమ విచారణలో ముఖ్యంగా గమనించామని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. చౌర్యం చేసిన వారిని పట్టుకోవాల్సిన బాధ్యతపై వుందని, మరింత లోతుగా విచారిస్తామని ప్రకటించారు.

 

తీవ్రంగా స్పందించిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్

 

డేటా చౌర్యం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత  పయ్యావుల కేశవ్‌ అన్నారు. కమిటీ నివేదికలో పెగాసెస్  జరిగిందా? లేదా? అనేదే లేదన్నారు. పెగాసెస్ వాడినట్లు అనుమానం ఉందని నివేదికలో చెప్పలేకపోయారన్నారు. ప్రభుత్వం కొండను తవ్వి చీమను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. లేనిది ఉన్నట్లుగా చెప్పాలని కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారని కేశవ్ విమర్శించారు.

Related Posts

Latest News Updates