పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. బాగా తాగి విమానం ఎక్కారని, అందుకే ఆయన్ను జర్మనీ ఎయిర్ పోర్టులో దించేశారని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనంగా వుందని, పంజాబీలు, దేశ గౌరవానికి సంబంధించిన అంశమని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అతిగా మద్యం సేవించడంతో భగవంత్ మాన్ ను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి దించేసినట్లు వార్తలొచ్చాయి.ఈ వ్యవహారం కారణంగా విమానం నాలుగు గంటలు ఆలస్యమైందని వార్తలొచ్చాయి. అయితే… ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనంగా వుందని, పంజాబీలు, దేశ గౌరవానికి సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, నిజానిజాలను బయటపెట్టాలని సుఖ్ బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.
అయితే.. దీనిని ఆఫ్ ఖండించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేసింది. అనుకున్న సమయం ప్రకారం విమానం బయల్దేరలేదని, ఆలస్యం అయిన మాట వాస్తవమేనని.. ఆలస్యానికి కారణం ఈ విమానానికి అనుబంధం ఉన్న మరో విమానం ఆలస్యంగా రావడమేనని ఆప్ పేర్కొంది. తన విదేశీ పర్యటనతో పెట్టుబడులు తీసుకొచ్చారని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఆప్ పేర్కొంది.