పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ : సీఎం జగన్

మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమెండ్ మెంట్ బిల్లు-2022, ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ అమెండ్ మెంట్ బిల్లు-2022 తో పాటు మరికొన్నింటిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని బిల్లులు ఆమోదం కూడా పొందాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కూడా సభలో చర్చ జరిగింది. దీనిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. పోలవరం విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, హామీ ప్రకారమే జీవో కూడా విడుదల చేశామని సీఎం తెలిపారు.

 

పోలవరం విషయంలో ఏం చెప్పామో… చెప్పిన దాని ప్రకారం ఓ జీవోను 30 జూన్ న విడుదల చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతీ మాటకూ తాము కట్టుబడి వుంటామని హామీ ఒచ్చారు. ఆర్ అండ్ ఆర్ కింద గత ప్రభుత్వంలో 6.86 లక్షల పరిహాం ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని, అందుకు తగ్గట్లే జీవో కూడా ఇచ్చామన్నారు. ఇక… పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబే నాశనం చేశారని దాని రిపేర్ కోసమే నానా తంటాలు పడుతున్నామని సీఎం జగన్ అన్నారు.

Related Posts

Latest News Updates