RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా! అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆల్ రెడీ దర్శకుడు, నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తారనే అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఏమో వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా ఏమో షూటింగ్‌ను షురూ చేసుకోలేదు. అందుకు కారణం.. పక్కా హిట్ మూవీతోనే రావాలని తారక్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతోంది. NTR #30కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో జరుగుతున్న డిస్కషన్. నిజానికి ఆలియా భట్ హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావటం.. ఆలియా భట్ ప్రెగ్నంట్ కావటం వంటి కారణాలతో NTR #30 నుంచి ఆమె తప్పుకుందని టాక్. దీంతో మేకర్స్ హీరోయిన్‌ని వెతికే పనిలో బిజీగా ఉన్నారట. వినిపిస్తోన్న సమాచారం మేరకు NTR #30 నిర్మాతలు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తో చర్చలు జరుపుతున్నారట. ఆమెకు సినిమాలో నటించటానికి ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్‌మెంట్‌లో ఇబ్బందులు ఉందని అంటున్నారు. ఒకవేళ ఆమె నో చెప్పేస్తే.. నెక్ట్స్ రష్మిక మందన్నతో మాట్లాడాలని నిర్మాతలు ఆలోచనగా కనిపిస్తుందని టాక్.స్క్రిప్ట్ విషయంలో తారక్, కొరటాల శివ కాంప్రమైజ్ కావాలనుకోవటం లేదు. అంతా ఓకే అయిన తర్వాత సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారట. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనే వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ విషయంలో ఇప్పుడు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.