‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లో నాకు ఆ పాత్ర దొరకడం అదృష్టం! : హీరోయిన్ కృతిశెట్టి

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.  సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో  సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో  సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు హీరోయిన్ కృతిశెట్టి.
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో మీ పాత్రకు చాలా మంచి స్పందన రావడం ఎలా అనిపించింది ?
నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి ”నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్నట్లువుంది” అని చెపుతుంటే చాలా ఆనందంగా వుంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం.
చాలా ఎమోషనల్ రోల్ ఇది…  ఎలా ప్రీపెర్ అయ్యారు ?
నేను ప్రతి సినిమాకి, పాత్రకి హోమ్ వర్క్ చేస్తాను. పాత్రని వివరంగా రాసుకుంటాను. అప్పుడు ఆ పాత్రని అభినయించడం సులువౌతుంది. సెట్ లో ఒక సీన్ జరుగుతున్నపుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతుందని చేస్తాను. ఇలా చేసినప్పుడు చాలా సహజమైన హావ భావాలు పలుకుతాయని నమ్ముతాను. ఈ పాత్రని కూడా అలానే చేశాను.
మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది ?
కెరీర్ బిగినింగ్ లోనే ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక నటిగా చాలా ఆనందంగా వుంది. నిజానికి నేను డాక్టర్ ని కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరా బాద్ రావడం, తొలి సినిమా ఉప్పెన అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింత కష్టపడి మరిన్ని మంచి పాత్రలు , సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
నిర్మాత కిరణ్ గారి గురించి ?
కిరణ్ గారు చాలా సెన్సిబుల్. కథపై ఆయనకి మంచి అభిప్రాయాలు వున్నాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి కృతజ్ఞతలు. చాలా ప్రత్యేకమైన పాత్ర చేశాను. పదేళ్ళ తర్వాత కూడా గుర్తుంటుంది.
సుధీర్, ఇంద్రగంటి గారిది పాపులర్ కాంబినేషన్ కదా.. సెట్స్ లో ఎలా వుంటారు ?
నేను, సుధీర్ బాబు గారి కంటే సుధీర్, ఇంద్రగంటి గారి కెమిస్ట్రీ బావుంటుంది (నవ్వుతూ). సుధీర్, ఇంద్రగంటి గారి మధ్య గ్రేట్ వర్క్ ఎనర్జీ వుంటుంది. నేను పని చేసిన అందరు దర్శకులు, హీరోల దగ్గర మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇంద్రగంటి గారి సినిమా షూటింగ్ స్పెషల్ గా వుంటుంది. దాదాపు 70 రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. ఇంద్రగంటి గారు  చాలా కూల్. తన పనిని చాలా ఎంజాయ్ చేస్తారు. సెట్ కి ప్రతి రోజు ఫ్రెష్ మైండ్ తో వస్తారు. చాలా అంశాలు ఆయన నుండి నేర్చుకున్నాను.
సుధీర్ బాబు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు గారు వండర్ ఫుల్ కోస్టార్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా అంకిత భావంతో పని చేస్తారు. చాలా స్ఫూర్తిని నింపుతారు. సెట్స్ లో ఎంతో సహాయంగా వుంటారు. చాలా సున్నితమైన వ్యక్తి. ఆయనకి చాలా సలహాలు అడిగాను. ఎప్పుడూ చిరాకు పడలేదు.(నవ్వుతూ) ఈ విషయంలో సుధీర్ బాబు గారికి కృతజ్ఞతలు.
ఈ సినిమా చూసిన తర్వాత మీ ఇంట్లో  ఎలాంటి ప్రసంశలు వచ్చాయి ?
మా అమ్మగారు చాలా ఎమోషనల్ అయ్యారు. నాన్న గారికి కూడా చాలా నచ్చింది. నేను ఈ పాత్ర చేయడం వారికీ చాలా గర్వంగా అనిపించింది. నా ఫ్యామిలీ నుండి నాకు పూర్తి ప్రోత్సాహం వుంది. ఈ విషయంలో నేను లక్కీ.
కొత్త గా చేస్తున్న సినిమాలు ?
నాగ చైతన్య, సూర్య గారి తో సినిమాలు చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో వున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్