బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి బరిలోకి దిగాలని జేడీయూ అధినేత నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో నితీశ్ కుమార్ యూపీలోని ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. రాష్ట్రంలో ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేశ్ యాదవ్ నితీశ్‌ను అహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రం నుంచి బరిలోకి దిగినట్లయితే ఎస్పీ పూర్తిస్తాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఫుల్‌పూర్ నుంచి కాకుండా అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి నితీశ్ పోటీ చేసే అవకాశం ఉందని జేడీయూ యూపీ అధ్యక్షుడు లలన్ సింగ్ తెలిపారు.