జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం… 11 మంది దుర్మరణం

జమ్మూ కశ్మీర్ పూంచ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. దీంతో 11 మంది మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మండిలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మినీ బస్ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

మినీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మనోజ్‌ సిన్హా తన ట్వీట్‌లో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates