26 రకాల ఔషదాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించింది. ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను అత్యవసర జాబితా నుంచి తొలగించింది. ఈ ట్యాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో పాటు 26 రకాల మందులను భారత దేశ మార్కెట్ నుంచే తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆల్టెప్లేస్, అటెనోలోల్, కాప్రోమైసిన్, సైట్రిమైడ్, ఎరిత్రో మైసిన్, ఇథినైల్ స్ట్రాడియోల్, నోరెథిస్టిరాన్, స్టావుడిన్ (సి), లెఫ్టునోమైడ్, మిథైల్డొపా, నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్పెరాన్ ఆల్ఫా 2ఏ, లిగ్నోకైన్ బీ, సుక్రాల్ ఫేట్, వైట్ పెట్రోలేటంతో సహా మరికొన్ని మందులు నిషేధిత జాబితాలో వున్నాయి. 384 ఔషదాలను కలిగిన కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ ను విడుదల చేశారు. ఆ జాబితా నుంచి 26 ఔషదాలను తొలగించారు.