మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం!!
సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన వయసు 83 సంవత్సరాలు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ జీర్ణించుకోలేకపోతుంది. సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. . పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు. కృష్ణంరాజు తుది శ్వాస విడిచారనే వార్త టాలీవుడ్‌కి షాకింగ్‌గా ఉంది. కృష్ణంరాజు ఇక లేరనే వార్తను తెలుగ చిత్రసీమ జీర్ణించుకోలేకపోతుంది. సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ప్రభాస్ విషయంలో కృష్ణంరాజు ఎంతో కేర్ తీసుకున్నారు. పెద్దనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ఇష్టం. ఆయనకు ప్రభాస్‌కి సంబంధించిన ఓ విషయంలో మాత్రం కోరిక నేరవేరలేదు. ఆయన నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ప్రభాస్ విషయంలో కృష్ణంరాజు ఎంతో కేర్ తీసుకున్నారు. పెద్దనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి వెండితెరపై నటించటాన్ని ఎంజాయ్ చేసేవారు. రెబల్ , బిల్లా , రీసెంట్‌గా విడుదలైన రాధే శ్యామ్ లోనూ కృష్ణంరాజుతో ప్రభాస్ కలిసి నటించేవారు. నటుడిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా తనదైన అధ్యాయాన్ని రాసిన ఆయనకు ప్రభాస్‌కి సంబంధించిన ఓ విషయంలో మాత్రం కోరిక నేరవేరలేదు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/9xSQVkm2kU
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 11, 2022