టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. శర్వానంద్, అక్కినేని అమల తల్లీ కొడుకులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా రేపే విడుదల అవుతోంది. ఈ సందర్భంలో ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూసే.. నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. న తల్లి, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకొచ్చాయని ఆయన అన్నారు. సినిమా చూసినంత సేపు చాలా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను చూస్తే ఎవరికైనా ఎడుపొస్తుందని చెప్పారు.
ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని నాగ్ ఆకాంక్షించారు. కాగా, నాగార్జునతో పాటు అమల, శర్వానంద్, అక్కినేని అఖిల్ తదితరులు ఈ సినిమా ప్రీమియర్ వీక్షించారు. ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా రీతూవర్మ నటించగా.. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు.. ఇందులో అమల అక్కినేనితో పాటు నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇతర పాత్రలు పోషించారు. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.
https://twitter.com/ImSharwanand/status/1567501291546615808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1567501291546615808%7Ctwgr%5Eedca5ff42d6e052f95e72077b39f194083458717%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fnagarjuna-got-emotional-after-watching-oke-oka-jeevitham-movie