సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ… 57 అంశాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీలో 81 వేల కోట్లు పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 21 వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

ఆజాదీకా అమ్రుత్ మహోత్సవ్ లో భాగంగా 195 మంది ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూతకు ఆమోదం లభించింది. ఈ నెల 22 నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. ఇక… సచివాలయంలో 85 అదనపు పోస్టులకు, ఒక్కో సచివాలయానికి 20 లక్షల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. వీటితో పాటు నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, పైడిపాలెం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్యాకేజీ, అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related Posts

Latest News Updates