ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్‌గాంధీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శించుకున్నారు. రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామివివేకానంద చిత్రపటాలకు నమస్కరించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా.. రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ జాతీయ జెండాను అందించారు.

 

రాహుల్ వెంట 59 ట్రక్కులతో పాటు 118 మంది కాంగ్రెస్ నేతలు కూడా వున్నారు. మిలే కదం… జుడే వతన్ నినాదంతో పాదయాత్ర ప్రారంభమవుతుంది. విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కాని అటువంటి విద్వేష రాజకీయాలకు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని రాహుల్ ట్వీట్ చేశారు.

 

భారత్ జోడో’ కార్యక్రమం ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్రకు రాహుల్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కదలించేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 150 రోజుల (5 నెలలు) పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.

 

 

Related Posts

Latest News Updates