ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే కేబినెట్ భేటీ పలుసార్లు వాయిదా పడింది. ఇక… ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రి మండలి చర్చించనుంది. వివాదాస్పదంగా మారిన సీపీఎస్ అంశంపై కూడా చర్చించనుంది. ఇక.. జీపీఎస్ అమలుకు సంబంధించిన జీవోలను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీనిని కేబినెట్ ఆమోదించనుంది.