పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ లను నియమించారు. విశాఖకు త్వరలోనే అభ్యర్థిని ఖారరు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు నుంచి ప్రతి ఇన్ చార్జి నియోజకవర్గంలో ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇకపై త్రిమెన్ కమిటీ పర్యవేక్షణ ఉండాలన్నారు.