భారత నౌకాదళ పతాక రూపు రేఖలు మారాయి. ప్రస్తుతమున్న జెండా రూపు రేఖలు బ్రిటీష్ కాలం నాటివి. అందుకే దీనిని త్వరలో మార్చుతున్నట్లు పీఎంవో ప్రకటించింది. మారిన నౌకాదళ పతాకాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ పై కొత్త పతాకాన్ని ఆవిష్కరిస్తారని పీఎంవో పేర్కొంది. పాత జెండా బ్రిటీష్ వాసనలను ఇంకా మోస్తోందని, సరికొత్తగా ఆవిష్కరించబోయే పతాకం సంపన్నమైన భారతీయ వారసత్వానికి తగినట్టుగా వుంటుందని పీఎంవో తెలిపింది. ప్రస్తుతం భారత నావికాదళం చిహ్నంలో రెండు ఎరుపు చారల కూడలిలో భారతీయ చిహ్నం ప్రదర్శించబడుతుంది. ఎరుపు క్షితిజ సమాంతర-నిలువు చారలతో తెల్లటి జెండాతో ఖండంలో త్రివర్ణ పతాకం ఉంటుంది. కొత్త ఎన్‌సైన్‌పై ఎలాంటి వివరాలు లేనప్పటికీ, ఇది ప్రస్తుత ‘క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్’ – తెల్లని నేపథ్యంలో ఉన్న రెడ్ క్రాస్‌ను తొలగించే అవకాశం ఉంది.