రాముడి స్ఫూర్తితోనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ : ప్రధాని మోదీ

అయోధ్య మహా నగరంలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందు కోసం ఆయన అయోధ్యకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి యోగి, గవర్నర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత రామజన్మభూమి స్థలంలో తాత్కాలిక ఆలయంలో రామ్ లల్లాను మోదీ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతి తీసుకున్నారు. తర్వాత… అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్టు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. తర్వాత రామకథా పార్కులో శ్రీరాముడు, సీత ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ఒరిజినల్ కాపీపై రాముడు, లక్ష్మణుడు, సీతామాత చిత్రాలు ఉన్నాయని అన్నారు. మన రాజ్యాంగ హక్కులకు అది మరో గ్యారెంటీ అని అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఉత్సవాలు చేసుకుంటున్నామని, ఈ సందర్భంగా ఈ యేడు దీపావళి వచ్చిందన్నారు. శ్రీరాముడి వంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని రాముడ్ని కోరుకున్నట్లు తెలిపారు.

 

 

తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా రాముడు నేర్పిన విలువలే ‘సబ్‌‌‌‌కా సాథ్.. సబ్‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌’కు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘సబ్‌‌‌‌కా విశ్వాస్, సబ్‌‌‌‌కా ప్రయాస్‌‌‌‌’ కు కూడా ఆయన విలువలే ఆధారమని చెప్పారు. వచ్చే పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కావాలని ఆకాంక్షించే ప్రజలకు శ్రీరాముడి ఆదర్శాలు దారి చూపిస్తాయని అన్నారు. మన దేశంలో ఒకానొక దశలో రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నార్థంకం చేశారని, తాము అధికారంలోకి వచ్చాక.. పూర్తిగా పరిస్థితులను సరిదిద్దామని అన్నారు.

Related Posts

Latest News Updates