మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్… ప్రధానిగా లీ కియాంగ్

చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఎన్నికై… రికార్డు నెలకొల్పారు. అయితే… మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత హు జింటావోను చైనా కమ్యూనిస్టు పార్టీ మహా సభల నుంచి అర్ధాంతరంగా బయటకి పంపించేశారు. ఈ వాతావరణంలో జిన్ పింగ్ మూడోసారి అధ్యక్షుడయ్యారు. ఇక… చైనా ప్రధానిగా జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీ కార్యదర్శిగా చేసిన లీ కియాంగ్ ను ఎంపిక చేశారు. ఇక.. పార్టీ పొలిట్ బ్యూరోలోకి కూడా కొత్త సభ్యులను తీసుకున్నారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ.. సమావేశాలను విజయవంతంగా ముగించామని, అంతర్జాతీయ సమాజం సమావేశాలను ఆసక్తిగా చూస్తోందన్నారు. చైనాను అన్ని రకాలుగా సోషలిస్టు దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పుకొచ్చారు.

 

గతంలో పార్టీలో రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే నియమం ఉండేది. అయితే 2018లో జిన్ పింగ్ ఈ నియమాన్ని రద్దు చేశారు. దీంతో మూడోసారి మాత్రమే కాదు… ఎన్ని సార్లు అయినా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడింది. షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్ ను… ప్రధానిగా ఎన్నుకున్నారు. కియాంగ్ పేరును.. జిన్ పింగ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు పార్టీ  పొలిట్‌బ్యూరో.. స్టాండింగ్‌ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా వెల్లడించారు. ఈ కమిటీలో షీ జిన్‌పింగ్‌, లీ కియాంగ్‌తో పాటు ఝావో లిజి, వాంగ్‌ హునింగ్‌, కాయి కి, డింగ్‌ షూషాంగ్‌, లీషీకు స్థానం కల్పించారు. శనివారం వరకు జరిగిన పార్టీ కాంగ్రెస్ సమావేశాలను విజయవంగా ముగించామని జిన్ పింగ్ అన్నారు.

Related Posts

Latest News Updates