కాంగ్రెస్ కి ఝలక్… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు

కాంగ్రెస్ కి అనుబంధంగా నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి చెందిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం రద్దు చేసింది. విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిన తర్వాత.. ఈ ఎన్జీవోపై కేంద్రం చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన నోటీసులను కేంద్రం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి ఇప్పటికే పంపించింది. అయితే.. ఫౌండేషన్ దీనిపై ఇంకా స్పందించలేదు. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ విచారణ తర్వాతే లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ మినిస్టీరియల్ కమిటీని కేంద్ర హోంశాఖ 2020 లో ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఫౌండేషన్ కు సోనియా గాంధీ చైర్ పర్సన్ గా, మన్మోహన్ సింగ్, చిదంబరం, రాహుల్, ప్రియాంక ట్రస్టీలుగా కొనసాగుతున్నారు.

 

 

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్థాపించారు. 1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్ కోసం తీర్మానం ఆమోదించింది. 1991లో స్థాపించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. అప్పటినుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వికలాంగుల సహాయం మొదలైన అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేసింది. అంతేకాదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ విద్యా రంగంలో కూడా పనిచేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు చైనా నుండి నిధులు అందుతున్నయన్న విషయంపై దర్యాప్తుకు… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. మ

Related Posts

Latest News Updates