జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసుల్లో పేర్కొన్నారు. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చన్న సందేశం ఆయన వ్యాఖ్యల్లో వుందన్నారు. పవన్ మాటలు మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారతాయి అని వాసిరెడ్డి పద్మ అన్నారు.
జనసేన పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తర్వాత జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా విడాకులిచ్చి పెళ్లిళ్లు చేసుకోవచ్చు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ నోటీసులిచ్చింది.