* కాయగూరల సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు జి.ఎల్ .బి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న వైవిధ్యభరిత చిత్రం ‘ఐక్యూ’ . కెఎల్పి మూవీస్ బ్యానర్ పై కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాయగూరల లక్ష్మీపతి , పల్లె రాఘనాథ్ రెడ్డి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.. సుమన్ , సూర్య , బెనర్జీ , సత్యప్రకాష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ ఆడియో రిలీజ్ పంక్షన్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.. పోలూరు ఘటికా చలం సంగీతం అందించిన ఈ సినిమా బిగి సీడిని ఏపి మాజీ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాస్ లాంచ్ చేశారు.. ఈ సందర్భంగా ఘటికాచలం దంపతులను చిత్రయూనిట్ సన్మానించింది..అనంతరం
*ముఖ్య అతిథి ఏపి మాజీ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ … నేను , ప్రముఖ నిర్మాత కె.ఎస్ .రామారావు గారి చేతులు మీదుగా ప్రారంభమైన ఈ ఐక్యూ సినిమా 20 రోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు.. స్టార్స్ ఉన్నా…కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవు ..కానీ ఈ సినిమా సాంగ్స్ , ట్రైలర్స్ చూశాక మంచి కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.. హీరో సాయిచరణ్ మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు .. మంచి భవిష్యత్తు ఉందన్నారు.. సినీ ఇండస్ట్రీ ప్రముఖలతో మాట్లాడి సినిమా రిలీజ్ కోసం తనవంతు సహాకారం అందిస్తానని హామి ఇచ్చారు.
* నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ -ఐక్యూ చిత్రాన్నిజూన్ 18 న ఘంటా శ్రీనివాస్ గారి అశీస్సులతో ప్రారంభించి… ఆగష్ట్ రెండో వారం లోపు సక్సెస్ ఫుల్ షూటింగ్ పూర్తి చేశామని అన్నారు… అనంతపురంలో షూటింగ్ పెడితే సుమన్ ,సత్య ప్రకాష్ బాగా సహకరించారని తెలిపారు . తన రెండో అన్నయ్య కాయగూరల శ్రీనివాస్ కోడుకు కాయగూరల సాయిచరణ్ హీరో అవుతానని..దానికి సహకరించాలని కోరాగానే నిర్మించడానికి ముందుకొచ్చానని అన్నారు.. రచయిత ఘటికాచలం తను క్లాస్ మేట్స్ అని ..విషయం చెప్పగానే ..మంచి కథ చెప్పాడు… ఆ కథ నచ్చి షూటింగ్ ప్రారంభించామని అన్నారు.. ఐక్యూ చిత్రాన్ని మంచి కథ ,కథానాలతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని , ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.. నవంబర్ చివరివారంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు..
* చిత్ర దర్శకులు జిఎల్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఐక్యూ చిత్రానికి క్లాప్ కొట్టిన ఘంటా శ్రీనివాస్ గారు ..తిరిగి మళ్లీ అడియో పంక్షన్ కి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. హీరోహీరోయిన్స్ కొత్తవారైన చాలా బాగా నటించారని , సీనియర్ నటులు సుమన్ , సత్యప్రకాష్ బాగా సహాకరించాని అన్నారు… తన గాడ్ ఫాదర్ ఘటికాచలం వల్లే ఈ సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు.. ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయని ..వాటికి ఘటికాచలం గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని అన్నారు.. ఐక్యూ యూత్ కు బాగా నచ్చుతుందని తెలిపారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న మా చిత్రాన్ని నవంబర్ చివరి వారంలో రిలీజ్ చేస్తామని …ప్రేక్షకులు ఐక్యూ టీమ్ ను ఆశీర్వదించాలని కోరారు..
*సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ – ఐక్యూ సాంగ్స్ , ట్రైలర్స్ చూస్తే…సీనియర్ ప్రోడక్షన్ హౌస్ తీసినట్లుందన్నారు…. పోలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన కాయగూరల లక్ష్మీపతి సినిమా ను బాగా క్వాలిటిగా తీశారని…. కాలేజి స్టూడెంట్స్ నేపధ్యంలో రూపోందిన ఈ సినిమా అన్నివర్గాలకు నచ్చుతుందని అన్నారు.. .. ఐక్యూ కు పనిచేసిన టెక్నిషియన్స్ మంచి అవుట్ పుట్ ఇచ్చారని అన్నారు.. . హీరోహీరోయిన్స్ కొత్తవారైన బాగా చేశారని …అంతేకాకుండా ఐక్యూలో మంచి కంటెంట్ ఉందని..ప్రేక్షకులు ఆదరించాలని కోరారు..
* హీరో కాయగూరల సాయిచరణ్ మాట్లాడుతూ : సత్యానంద్ గారి వద్ద నటనలో శిక్షణ పోందిన తర్వాత …తన బాబాయి ని వెళ్లి సినిమా చేస్తా అని అడగగానే.. సోంత ప్రోడక్షన్ హౌస్ మొదలు పెట్టి అవకాశం ఇచ్చారని అన్నారు.. ఘంటా శ్రీనివాస్ గారి అశీస్సులతో ఈ సినిమా పూర్తి చేశామని అన్నారు.. సీనియర్ నటులు సుమన్ , సత్యప్రకాష్ గార్లు బాగా సహాకరించారని అన్నారు.. ఒపిక ఉన్నంతకాలం కాదు..ఊపిరి ఉన్నంత కాలం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తానని అన్నారు…
*హీరోయిన్స్ పల్లవి, ట్రాన్సీ మాట్లాడుతూ : ఐక్యూ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు..
* రచయిత ,సంగీతదర్శకులు ఘటికాచలం : తన మొదటి చిత్రం సంపంగి హిట్ అవ్వడానికి కారణం స్నేహం.. ఐక్యూ సినిమా రూపోందడానికి కారణం నిర్మాత కాయగూరల లక్ష్మీపతి తో స్నేహం అని తెలిపారు.. … మంచి కథ , కథనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని అన్నారు.. హర్ట్ కానంత వరకు పడతా..హర్ట్ అయితే కోడతా వంటి మంచి మాస్ డైలాగ్స్ చాలా ఉన్నాయని అన్నారు.. దర్శకుడు జిఎల్ బి శ్రీనివాస్ కూల్ గా కనపడతాడు గానీ… బెటర్ అవుట్ పుట్ వచ్చేవరకు కష్టపడతాడని అన్నారు.. యూత్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు…
* వీరితో పాటు ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బసిరెడ్డి , , నెం 1 చానెల్ అదినేత మంచాల సుధాకర్ నాయుడు , నిర్మాతలు అశోక్ కుమార్ , రామసత్యనారాయణ , దర్శకులు వి సముద్ర , సీనియర్ నటులు సుమన్ , సత్యప్రకాష్ , చిత్రయూనిట్ , పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గోన్నారు…