జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడులు.. ఇద్దరు వలస కూలీల దుర్మరణం

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రెనేడ్ దాడులకు దిగారు. షోపియాన్ లోని హర్మెన్ ప్రాంతంలో వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపై  ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ గ్రెనేడ్ దాడిలో యూపీకి చెందిన రామ్ సాగర్, మోనిశ్ కుమార్ అనే దినసరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత హర్మెన్ ప్రాంతంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ సోదాలు చేపట్టింది. పుల్వామాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని పోలీసులు అరెస్ట్ చేశారు. కూలీలపైకి ఇమ్రానే బాంబులు విసిరినట్లు పోలీసులు గుర్తించారు.

Related Posts

Latest News Updates