చేసే మంచి పని అందరికీ చెప్పడంలో సెల్ఫ్ డబ్బా అవసరం.. తప్పులేదు…: మంచు మోహన్ బాబు

మంచు విష్ణు సారథ్యంలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త గవర్నింగ్ బాడీ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిధిగా  డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది పూర్తిచేసుకున్న విష్ణు టీమ్‌ను ఆయన అభినందించారు. మనం చేసే మంచి పనులు అందరికీ చెప్పుకోవడంలో తప్పులేదని.. దీన్ని సెల్ఫ్ డబ్బా అనరని ఆయన అన్నారు. ఆంజనేయుడి అంతటివాడే తన గురించి తాను రావణాసురిడి దగ్గర చెప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మనం గురించి మనం గొప్పగా చెప్పుకుంటే చాలా మంది సెల్ఫ్ డబ్బా అని అంటారని.. కానీ, కొన్ని సమయాల్లో సెల్ఫ్ డబ్బా అవసరమని సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.‘‘నేను బ్రదర్ అని పిలిచే అత్యంత ఆత్మీయుడు కృష్ణంరాజు మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం. విష్ణుని ఎంతో ప్రోత్సహించేవారు. ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. అలాంటి వ్యక్తి లేకపోవడం నిజంగా మనసుకు కష్టంగా ఉంది’’ అని మోహన్ బాబు తన స్పీచ్‌ను మొదలుపెట్టారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. ‘‘గెలవడం, ఓడడం అనేది సహజం. సినిమా విజయం సాధించడం, అపజయం కావడం సహజం. కానీ, మరణ మహర్షి గారు చెప్పినట్టు.. ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో అవన్నీ కలబోసి ఒక మిక్సర్‌లో వేస్తే తయారయ్యేవాడే మనిషి. జనులకు నిలువెల్ల విషమే అన్నాడు. అలా, ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్లు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను’’ అని ప్రత్యర్థులపై పంచ్‌లు వేశారు మోహన్ బాబు.‘‘నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఇలా ఎప్పుడూ మీటింగ్‌లు పెట్టలేదు. ఇలా ఎప్పుడూ డిన్నర్లు ఇవ్వలేదు. మొదటిసారి నేను చూస్తున్నాను. చాలా మంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారురో అంటారు. అవసరం.. భారత, భాగవత, రామాయణాల్లో చూసుకుంటే.. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు సీతాదేవి దగ్గర అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని అని చాలా సంవినయంగా చెప్పాడు. రావణాసురిడి దగ్గరకు వెళ్లిన తరవాత కుర్చీనే వేయొద్దని చెప్తే నేనెంతటివాడినో చూపిస్తానని చెప్పి లంకా దహణమే చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సంవినయంగా ఉండాలి.. ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. కాబట్టి మనం ఏం చేశామనే విషయాన్ని 10 మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చేయనప్పుడు సెల్ఫ్ డబ్బా’’ అని మోహన్ బాబు వెల్లడించారు. విష్ణు మాటిచ్చాడు కాబట్టి కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త భవనాన్ని నిర్మిస్తాడని మోహన్ బాబు
అన్నారు .

Related Posts

Latest News Updates