అనంతపురం వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2 వేల తక్షణ ఆర్థిక సహాయం

అనంతపురాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని, వారికి సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం పక్షాన తక్షణ సహాయం కింద బాధిత కుటుంబాలకు 2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 2 వేలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేయాలన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టం, ఆస్తి నష్టం అంచనా వేయాలని, వెంటనే నష్ట పరిహారాన్ని కూడా అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

 

అనంతపురం జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది.

 

 

ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించటంతో అర్ధరాత్రి దాటాక ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. అయితే పోలీసులు చాలా మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షానికి కక్కలపల్లి చెరువు నిండి.. రుద్రంపేట వంకకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక కాలనీలు జలమయం కాగా.. తాళ్ల సాయంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న 30 మంది హాస్టల్ విద్యార్థులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related Posts

Latest News Updates