దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022ను ఆదివారం బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగగా వేడుక జరిగింది. దక్షిణాదికి చెంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. తెలుగులో పుష్ప ది రైజ్ సినిమా, తమిళంలో సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) సినిమాల హవా కొనసాగాయి. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా.. సుకుమార్ బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022ను ఆదివారం బెంగుళూరు లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగగా వేడుక జరిగింది. దక్షిణాదికి చెంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. తెలుగులో ‘పుష్ప ది రైజ్’ సినిమా, తమిళంలో సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) సినిమాల హవా కొనసాగాయి.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022 విన్నర్స్ లిస్ట్.. (తెలుగు)
ఉత్తమ చిత్రం – పుష్ప ది రైజ్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
ఉత్తమ నటి – సాయి పల్లవి (లవ్ స్టోరి)
బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప ది రైజ్)
ఉత్తమ సహాయ నటుడు – మురళి శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి – టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – నాని (శ్యామ్ సింగరాయ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయి పల్లవి (శ్యామ్ సింగరాయ్)
బెస్ట్ డెబ్యూ (మేల్) – పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
బెస్ట్ డెబ్యూ (ఫిమేల్) – కృతి శెట్టి ( ఉప్పెన)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప ది రైజ్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – సిద్ శ్రీరామ్ (శ్రీవల్లీ)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) – ఇంద్రావతి చౌహాన్ (ఊ అంటావా మావ)
బెస్ట్ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి (లైఫ్ ఆఫ్ రామ్)
బెస్ట్ కొరియోగ్రఫీ – రాములో రాముల ( అల వైకుంఠపురములో)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – మిరోస్లా కూబా బ్రెజెక్ (పుష్ప ది రైజ్)
https://twitter.com/alluarjun/status/1579329896559521793