‘ఎస్ ఎస్ రాజమౌళి’ సినిమాను ప్రేమించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన దర్శకధీరుడు. RRR ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును సాధిస్తే మరో మారు టాలీవుడ్ గర్వంగా తలెత్తుకుని నిలబడుతుందనటంలో సందేహం లేదు.తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 నుండి త్రిబుల్ ఆర్ వరకు అప్రతిహతంగా వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన మన జక్కన్న రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ఈ సందర్భంగా ఆయన మనమందరం గర్వపడే గొప్ప సినిమాలను రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టూడెంట్ నెం.1తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తొలి చిత్రంతో సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో సినిమాగా చేసిన సింహాద్రితో అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. హిట్ మీద హిట్ కొడుతూ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తూ వచ్చారు. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమ దొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ ఇలా వరుస చిత్రాలతో తెలుగులోనే కాదు.. దక్షిణాదిని దాటి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే విదేశీయులకు కాదు.. అంతకు మించి చాలానే ఉందిక్కడ అంటూ బాహుబలి చిత్రంతో నిరూపించారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డులను తారుమారు చేసే ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నారు. ఈ ఏడాది విడుదలైన RRRతో మరో సెన్సేషన్‌కు తెర తీశారు. ఇప్పుడు పన్నెండు వందల కోట్లకు పైగానే వసూళ్లను సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ హిస్టరీలో మరో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. తదుపరి సూపర్ స్టార్ మహేష్‌తో పాన్ వరల్డ్ మూవీని భారీ ఎత్తున నిర్మించటానికి సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా చైనా జపాన్ వంటి దేశాలలో కూడా కలెక్షన్స్ పరంగా ఒక ఊపు ఊపేస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే RRRతో ఆస్కార్ అవార్డును సాధించడానికి అడుగులు వేసున్నారు జకన్న అండ్ టీమ్. ఇప్పటికే అమెరికా డిస్ట్రిబ్యూటర్ తరపు నుంచి ఆస్కార్ బరిలోకి జనరల్ కేటగిరీలో 15 అవార్డులకు RRR పోటీ పడనుంది. అందుకు సంబంధించిన క్యాంపెయినింగ్ జోరుగా సాగుతుంది. ఇందులో రాజమౌళి అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. RRR ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును సాధిస్తే మరో మారు టాలీవుడ్ గర్వంగా తలెత్తుకుని నిలబడుతుందనటంలో సందేహం లేదు. ఇలా సినిమా సినిమాకు తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుతోన్న మన జక్కన్న రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ఈ సందర్భంగా ఆయన మనమందరం గర్వపడే మరిన్ని గొప్ప సినిమాలను రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. హ్యాపీ బర్త్ డే రాజమౌళి.
Happy Birthday Jakkanna @ssrajamouli !! Wishing you the best as always. pic.twitter.com/WSq7Zon3KP
— Jr NTR (@tarak9999) October 10, 2022