భార్య మరణించిన ఆస్పత్రిలోనే… ములాయం కన్నుమూత

రాజకీయ దిగ్గజం, సమాజ్ వాదీ మార్గదర్శకుడు ములాయం యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే.. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ములాయం భార్య సాధనా గుప్తు కూడా అదే ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలోనే ములాయం భార్య సాధనా గుప్త కన్నుమూశారు.

 

ఇప్పుడు ములాయం యాదవ్ కూడా అదే ఆస్పత్రిలో కన్ను మూయడం విశేషం. 2003 లో ములాయం మొదటి భార్య, అఖిలేశ్ తల్లి మాలతీ దేవి మరణించారు. కొన్ని రోజుల తర్వాత ములాయం సింగ్ సాధన గుప్తను వివాహం చేసుకున్నారు. అయితే.. 1986 లో సాధనా గుప్తు వివాహం చంద్రప్రకాశ్ గుప్తాతో జరిగింది. వీరికి ఒక కుమారుడు. ఆయన పేరు ప్రతీక్ యాదవ్. కొన్ని రోజుల తర్వాత సాధనా గుప్త, చంద్రప్రకాశ్ విడిపోయారు. ఆ తర్వాతే సాధనా గుప్త ములాయం రెండో భార్యగా వచ్చారు.

Related Posts

Latest News Updates