పీఎఫ్ఐతో సత్సంబంధాలు నెరుపుతున్న కేరళ పోలీసులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు

ఎన్ఐఏ తన దర్యాప్తులో సంచలన విషయాన్ని తెలుసుకుంది. కేరళకు చెందిన దాదాపు 873 మంది పోలీసు ఉన్నతాధికారులు నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలను కలిగి వున్నారని ఎన్ఐఏ తన దర్యాప్తులో తెలుసుకుంది. ఈ దర్యాప్తును అంతటినీ ఎన్ఐఏ అధికారులు కేరళ రాష్ట్ర డీజీపీకి సమర్పించారు. ఈ విషయం ఒక్కసారిగా బయటపడటంతో ఎస్సైలు, స్టేషన్ హెడ్ ఆఫీసర్లతో పాటు సివిల్ పోలీసులపై కూడా ఎన్ఐఏ నిఘా పెంచింది. వారి ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

 

ఇప్పటికే కొన్ని వివరాలను ఎన్ఐఏ సేకరించింది. స్పెషల్ బ్రాంచ్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నిషేధిత పీఎఫ్ఐ తో టచ్ లో వున్నారని ఎన్ఐఏ తెలిపింది. వీరందరూ కూడా ఎన్ఐఏ దాడుల గురించి, ఎన్ఐఏ వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు పీఎఫ్ఐకి చేరవేసేవారని ఎన్ఐఏ పేర్కొంది.

Related Posts

Latest News Updates