కెనడాలోని భగవద్గీతా పార్కు బోర్డు ధ్వంసం చేసిన దుండగులు

కెనడాలోని బ్రాంప్టన్ లో వున్న శ్రీ భగవద్గీతా పార్కు బోర్డును దుండగులు తొలగించేశారు. దాని స్థానంలో ఖాళీ బోర్డును వుంచారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే.. దీనిపై బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ స్పందించారు. భగవద్గీత బోర్డును ధ్వంసం చేసినట్లు కథనాలు వచ్చాయని, దీనిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ మెయింటేనెన్స్ కోసం బోర్డును తొలగించారని, దాని స్థానంలో శాశ్వతంగా వుండే బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

కెనడాలోని గీతా పార్క్ విధ్వంసం వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల పనేనని మాజీ డిప్యూటీ కెనడా రాయబారి నీరజ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఎందుకంటే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అది ఖలిస్తాన్ ఉగ్రవాదుల పనేనని అన్నారు. కెనడాలో విధ్వంసం జరగడం ఇది మొదటి సారి కాదని, సెప్టెంబర్ 15 న స్వామి నారాయణ్ గుడిపై కూడా ఖలిస్తాన్ నినాదాలు రాశారని గుర్తు చేశారు. గతంలోని ఘటనలను పరిగణనలోకి తీసుకొనే.. భగవద్గీత పార్కు విధ్వంసం వెనుక ఖలిస్తాన్ వుందని అంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates