శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారు స్వర్ణ రథోత్సవంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 గంటల వరకూ స్వర్ణ రథోత్సవం గోవింద నామ స్మరణ మధ్య సాగింది. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీ కరుణతో బంగారు సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గజ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.