విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి -దుబాయ్ కి డైరెక్ట్ ప్లయిట్

విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి  ఈ నెల 29నుంచి దుబాయికి డైరెక్ట్ ప్లయిట్ సర్వీసును  నడపనున్నట్లు ఎయిర్ పెర్ట్ అడ్వైజరీ కమిటీ అధికారి  వెల్లడించారు. వారంలో రెండు విమాన సర్వీసులు విజయవాడ నుంచి అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు.

Related Posts

Latest News Updates