బీపీ మండల్ విగ్రహ ప్రతిష్ఠాపనకు వెంటనే అనుమతులు కావాలి : ద్రావిడ దేశం డిమాండ్

గుంటూరులో బీపీ మండల్ విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతులు ఇవ్వాలని ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు డిమాండ్ చేశారు. కల్లబొల్లి సాకులు చూపి విగ్రహ ప్రతిష్టకు అంతరాయాలు కలిగిస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని కృష్ణారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు .దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో ఏర్పాటు తాము బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపోశామని పేర్కొన్నారు.

 

వైఎస్ఆర్సిపి పార్టీ శాసన మండలి సభ్యులైన జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో కాంస్య విగ్రహ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 25 న ప్రముఖ వైద్యులు ఆలా వేంకటేశ్వర్లు గారి సారథ్యంలో బీపీ మండల్ కాంస్య విగ్రహం నెలకొల్పడానికి శంకుస్థాపన జరిగిందని, అనేక మంది హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. దీనికి బీపీ మండ్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ కూడా వచ్చారని వి. కృష్ణారావు పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates