లఖీంపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. 25 మందికి పైగా గాయాలు..

ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ ఖేరిలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని 8 మంది చనిపోయారు. ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని లక్నో హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారికి సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

 

ఇక… ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, వైద్య చికిత్స కోసం 50 వేల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

Related Posts

Latest News Updates