రాజస్థాన్ కు కమల్ నాథ్… మహారాష్ట్ర సంక్షోభంలోనూ కమల్ నాథే…

రాజస్థాన్ లో నాయకత్వ మార్పు అనేది గంట గంటకూ ముదిరిపోతోంది. దీంతో పార్టీలో పెను ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గ‌హ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌దవికి పోటీ ప‌డితే ఆయ‌న స్ధానంలో స‌చిన్ పైల‌ట్ సీఎం ప‌గ్గాలు చేప‌డ‌తార‌నే వార్త‌ల‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భ‌గ్గుమ‌న్నారు. గెహ్లాట్ వ‌ర్గీయుడికే సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని డిమాండ్ చేస్తూ 80 మందికి పైగా ఆయ‌న వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీక‌ర్ పీసీ జోషీకి రాజీనామా లేఖ‌లు అంద‌చేశారు. స‌చిన్ పైల‌ట్ సీఎం అభ్య‌ర్ధిత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తామ‌ని వారు తేల్చిచెప్పారు. రాజ‌స్ధాన్ కాంగ్రెస్‌లో ప‌రిణామాల‌ను చ‌క్క‌దిద్దేందుకు సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లిఖార్జున్ క‌ర్గే, అజ‌య్ మాకెన్‌ల‌ను పంపిన పార్టీ హైక‌మాండ్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం అభ్యర్థిపై చర్చించడానికి సీఎల్పీ భేటీ నిర్వహిస్తే…. 20 మంది మాత్రమే వచ్చారు. దీంతో ఢిల్లీకి తిరిగి వచ్చేయాలని దూతలను అధిష్ఠానం ఆదేశించింది.

 

మరోవైపు తాను జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తనకు నమ్మకస్థుడైన వారు మాత్రమే సీఎం పదవిలో వుండాలని, యువనేత సచిన్ పైలట్ గానీ, ఆయన మద్దతుదారుడికి మాత్రం ఛాన్స్ ఇస్తే ఊరుకోమని గెహ్లాట్ అధిష్ఠానానికి తేల్చి చెప్పారు. అయితే… ఈ వివాదం ముగుస్తుందని సోనియా భావించారు. కానీ… గంట గంటకు ముదిరిపోతోంది. అయితే.. ఎమ్మెల్యేల రాజీనామాలో తన ప్రమేయం లేదని గెహ్లాట్ అంటున్నారు. మరోవైపు ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని సీనియర్ నేత కమల్ నాథ్ ను సోనియా ఆదేశించారు. పార్టీ హైక‌మాండ్ ఆదేశాల‌తో ఢిల్లీ చేరుకోనున్న క‌మ‌ల్ నాధ్ అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రిపిన మీద‌ట రాజ‌స్ధాన్ సంక్షోభాన్ని చ‌క్క‌దిద్దేందుకు జైపూర్ వెళ్ల‌నున్నారు. మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం స‌మ‌యంలోనూ ఆ రాష్ట్రంలో ఏఐసీసీ ప‌రిశీల‌కుడిగా పార్టీ అధిష్టానం క‌మ‌ల్‌నాధ్‌ను నియ‌మించింది.

Related Posts

Latest News Updates