భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు. యూకేను అధిగమించి, ప్రపంచంలోని 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ పై ఆసక్తి చూపుతున్నారని, భారత్ ను నమ్ముతున్నారని పేర్కొన్నారు.
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతామని, అది ఎంతో దూరంలో లేదని, చాలా దగ్గర్లోనే వుందని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021 చివరి మూడు నెలల్లో దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఆరవ స్థానానికి నెట్టివేసిందన్నారు. ఆర్థిక పరంగా బ్రిటన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి అని ఆనంద్ మహీంద్ర అన్నారు.
Surpassing the UK & becoming the world’s 5th largest economy has thrust India in the centre of the radar screen of global investors. I can only imagine how that attention will multiply when we become the 3rd largest economy—which isn’t too far away… pic.twitter.com/I5PehfTO0c
— anand mahindra (@anandmahindra) September 22, 2022