థాయ్ లాండ్ లో అమానుషం.. డేకేర్ సెంటర్ పై దుండగుడు కాల్పులు.. 34 మంది దుర్మరణం

థాయ్ లాండ్ లో అమానుష ఘటన జరిగింది. నార్త్ ఈస్ట్రన్ లోని చిల్ట్రన్ కేర్ సెంటర్ లో ఓ దుండగుడు కాల్పులు చేశాడు. ఈ ఘటనలో 34 మంది చనిపోయారు. ఇందులో 22 మంది చిన్నారులే కావడం విషాదకరం. ఈ కాల్పులు తర్వాత తనను తాను కాల్చుకుని ఆ 34 ఏళ్ల వ్యక్తి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఒక మాజీ పోలీసు అని తెలిసింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి తన భార్యాబిడ్డ ప్రాణం కూడా తీశాడు. గతేడాదే పోలీసు విధుల నుంచి అతను తప్పుకున్నట్లు తెలిసింది. ఇక… డ్రగ్స్ తీసుకుంటూ, మత్తుకు బానిసయ్యాడనే కారణంగా పోలీసు ఉద్యోగం నుంచి అతనిని తొలగించినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో విషాదం కూడా చోటుచేసుకుంది. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉంది. ఆమె ఆ డే కేర్ సెంటర్‌లో టీచర్‌గా చేస్తోంది.

Related Posts

Latest News Updates