ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 28 మంది పర్వతా రోహకులు అందులో చిక్కుకుపోయారు. ద్రౌపది దండా-2 శిఖరాగ్రంలో 10 మంది పర్వతా రోహకులు మరణించారు. మరో 18 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. ఉత్తర కాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ నుండి 33 మంది పర్వతారోహకులు, ఏడుగురు అధ్యాపకులు బయల్దేరారని తెలుస్తోంది. మరోవైపు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మరియు ఐటీబీపీ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను నిర్వహిస్తున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరాఖండ్ సీఎంకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. మరోవైపు హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఇప్పటి వరకూ 9 మందిని కాపాడామని సీఎం పేర్కొన్నారు.